USA: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువకుడి దుర్మరణం

Telangana student in loses life in accident in usa
  • పైచదువుల కోసం అమెరికా వెళ్లిన నిజామాబాద్ వాసి గుర్రపు శైలేశ్
  • శనివారం యువకుడు కారులో వెళుతుండగా అనూహ్యంగా ప్రమాదం
  • న్యూజెర్సీలోని సెల్టన్ కూడలి వద్ద శైలేశ్ కారును ఢీకొట్టిన మరో కారు
  • పెట్రోల్ ట్యాంకు దెబ్బతినడంతో రేగిన మంటలు, సజీవదహనమైన శైలేశ్
అమెరికాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి గుర్రపు శైలేశ్(25) దుర్మరణం చెందారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన శైలేశ్ పైచదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడ బయోమెడికల్ ఇంజినీరింగ్ చేస్తున్నారు. 

శనివారం శైలేశ్ కారులో వెళుతుండగా న్యూజెర్సీలోని సెల్టన్ కూడలి వద్ద మరోవైపు నుంచి వచ్చిన కారు నేరుగా పెట్రోల్ ట్యాంకును ఢీకొంది. దీంతో, శైలేశ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆయన సజీవ దహనమయ్యారు. శైలేశ్ మరణంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శైలేశ్ తండ్రి గతంలో గల్ఫ్‌కు వెళ్లివచ్చారు. ఆయన తల్లి గృహిణి. శైలేశ్ కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.
USA
Nizamabad District

More Telugu News