Team India: కొత్త జెర్సీల్లో టీమిండియా క్రికెటర్లు.. అదిరిపోయిన లుక్

  • టీమిండియా జెర్సీ స్పాన్సర్‌‌ గా వచ్చిన అడిడాస్ 
  • అడిడాస్ లోగో, డిజైన్‌లో స్వల్ప మార్పులతో కొత్త జెర్సీల విడుదల
  • వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లకు మూడు వేర్వేరు జెర్సీలు
India cricket team new Jersey revealed

టీమిండియా జెర్సీలు మారిపోయాయి. సరికొత్త జెర్సీలతో పురుషులు, మహిళలు మూడు ఫార్మాట్లలో బరిలోకి దిగబోతున్నారు.  భారత జాతీయ జట్టు జెర్సీ స్పాన్సర్ గా ప్రముఖ కంపెనీ అడిడాస్ రావడంతో జెర్సీల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. మొన్నటిదాకా స్పాన్సర్ గా ఉన్న బైజూస్ కంపెనీ స్థానంలో అడిడాస్ ఐదేళ్ల కాలానికి భారత జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు బీసీసీఐకి రూ.350 కోట్లు అడిడాస్ చెల్లించబోతోంది. ఈ క్రమంలో అడిడాస్ లోగోలను ముద్రించి కొంచెం డిజైన్ మార్చిన జెర్సీలను బీసీసీఐ విడుదల చేసింది. 

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యాతో పాటు మహిళా క్రికెటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కొత్త జెర్సీలు ధరించి చేసిన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వన్డే ఫార్మాట్లో ఉపయోగించి బ్లూ జెర్సీలో భుజాలపై తెల్లటి స్ట్రిప్స్ ను వేశారు. టెస్టు జెర్సీలో భుజాలపై బ్లూ స్ట్రిప్స్, ముందు భాగంలో ఇండియా పేరును కూడా బ్లూ కలర్ తో ముద్రించడంతో జెర్సీలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌ కు ఎప్పట్లానే రౌండ్ నెక్ టీ షర్ట్ ను కొనసాగించారు.  అండర్-19 నుంచి భారత సీనియర్ జట్టు వరకు పురుషులు, మహిళా క్రికెటర్లు ఈ జెర్సీలను ధరించనున్నారు.

More Telugu News