Elon Musk: భారతీయ వస్త్రధారణతో మస్క్ కొత్త లుక్స్!

Elon Musk reacts to AI generated pic that shows him as an Indian groom
  • ఏఐ సాయంతో మార్చివేసిన ఫొటో
  • కొత్త పెళ్లికొడుకు గెటప్ లో నవ్వులు చిందిస్తున్న మస్క్
  • ఐ లవ్ ఇట్ అంటూ మస్క్ కామెంట్
భారతీయ వస్త్రధారణలో ఉండే అందం, కళాత్మకత మరే ఇతర దేశాల వారి వస్త్రధారణలో ఉండదని నిస్సందేహంగా చెప్పొచ్చు. ముఖ్యంగా వేడుకల సమయంలో భారతీయులు ధరించేవి మరింత ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ప్రపంచ కుబేరుడు, టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తెల్ల జాతీయుడైనా.. ఒక్కసారిగా భారతీయుడిగా మారిపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మస్క్ అని తెలియని వారు నిస్సందేహంగా ఆయన్ని భారతీయ మార్వాడీగా పొరపాటు పడతారనడంలో సందేహం లేదు.

అలా ఉంది ఎలాన్ మస్క్ ఫొటో. దీన్ని సిడ్నీకి చెందిన ఓ ఆర్టిస్ట్ షేర్ చేశారు. ఏఐ సాయంతో భారతీయ వస్త్రధారణతో, కాబోయే వరుడి రూపంలో మస్క్ కనిపిస్తున్నారు. దీనికి మస్క్ సైతం స్పందించారు. ఐ లవ్ ఇట్ (నేను ఇష్టపడుతున్నాను) అంటూ రిప్లయ్ ఇచ్చారు. ఇటీవలి కాలంలో ఏఐ టెక్నాలజీ సాయంతో వ్యక్తుల చిత్రాలను మార్ఫింగ్ చేస్తుుండడం చూస్తూనే ఉన్నాం. యువకులుగా ఉన్నవారు వృద్ధాప్యంలో ఎలా ఉంటారు.. వృద్ధాప్యంలో ఉన్న వారు యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో ఏఐ సాయంతో తెలుసుకోవచ్చు.

ఇక సృజనాత్మకతకు హద్దేముందన్నట్టు.. ఎలాన్ మస్క్ ను షెలాన్ మస్క్ గా పేర్కొంటూ అందమైన యువతి రూపంలో మార్చిన ఫొటోని చైన్ జీపీటీ పేరుతో ఉన్న యూజర్ షేర్ చేయడం గమనార్హం. భారతీయ డ్రెస్ లో మస్క్ అచ్చమైన పంజాబీలా ఉన్నాడని ఓ వ్యక్తి పేర్కొంటే.. మిగిలిన వారు భారతీయ సంస్కృతిని మనసారా మెచ్చుకుంటున్నారు.
Elon Musk
reply
reaction
Indian wear
Indian groom

More Telugu News