Gudivada Amarnath: ఘోర రైలు ప్రమాదంపై జగన్ ఉన్నత స్థాయి సమీక్ష.. ప్రమాద స్థలికి మంత్రి గుడివాడ

Jagan sends Gudivada Amarnath to train accident location
  • కలెక్టర్ కార్యాలయాల్లో సమాచార విభాగాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం
  • అవసరమైతే ప్రమాద స్థలికి పంపించడానికి అంబులెన్సులు సిద్ధం చేయాలన్న జగన్
  • ఘటనా స్థలికి అమర్ నాథ్ నేతృత్వంలో ఐఏఎస్ అధికారుల బృందం పయనం

ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో సమాచార విభాగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ప్రమాద స్థలికి పంపించడానికి అంబులెన్సులను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒడిశా సరిహద్దుల్లోని విశాఖపట్నం మినహా, ఇతర జిల్లాల్లో ఆసుపత్రులను ఎమర్జెన్సీ సేవల కోసం అలెర్ట్ గా ఉంచాలని సూచించారు. 

మరోవైపు మంత్రి అమర్ నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బృందాన్ని ఘటనా స్థలికి పంపించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అమర్ నాథ్ రోడ్డు మార్గం ద్వారా ఘటనా స్థలికి బయల్దేరారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని, గాయపడిన వారిని ఈ బృందం తరలించే ఏర్పాట్లు చేస్తుంది. 

మరోవైపు ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో విజయవాడ డివిజన్ కు చెందిన 48 మంది, బెంగళూరు - హైరా ఎక్స్ ప్రెస్ లో విజయవాడ డివిజన్ కు చెందిన 48 మంది ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారి పరిస్థితి ఎలా ఉందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News