Odisha: ఒడిశా రైలు ప్రమాదంపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ వేస్తాం.. రైల్వే మంత్రి ప్రకటన

Railway minister says goverment to soon set up committee to probe odisha rail accident
  • బాలేశ్వర్‌లోని ప్రమాదస్థలిని సందర్శించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి
  • ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని వెల్లడి
  • ప్రమాదానికి గల కారణాలు ఇప్పుడే చెప్పలేమన్న మంత్రి
ఒడిశాలో బాలేశ్వర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని తెలిపారు. 

‘‘క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం సహాయకచర్యలపైనే దృష్టిపెట్టాం. ఘటనాస్థలంలో పరిస్థితులు సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రమాదానికి గల కారణాలు ఏంటో ఇప్పుడే చెప్పలేం. ఘటనపై మరింత విచారణ జరిపాక పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ప్రమాదంపై విచారణ కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తాం’’ అని మంత్రి తెలిపారు.
Odisha

More Telugu News