Wang: ఆఫీసుకు వచ్చి టాయిలెట్ లో కాలం గడుపుతున్న ఉద్యోగి... వేటు వేసిన కంపెనీ

  • వాంగ్ అనే ఉద్యోగిని తొలగించిన కంపెనీ
  • రోజుకు 6 గంటలు టాయిలెట్లోనే ఉంటున్న వాంగ్
  • ఇలాగైతే కష్టమంటూ చర్యలు తీసుకున్న కంపెనీ
  • కోర్టును ఆశ్రయించిన ఉద్యోగికి చుక్కెదురు
China company dismiss one employee due to his unhealthiness

ఓ ఉద్యోగి ఆఫీసుకు వచ్చి విధి నిర్వహణ కాకుండా, ఇతర పనులు చేస్తుంటే ఏ కంపెనీ యాజమాన్యానికైనా ఒళ్లు మండుతుంది. చైనాలోని వాంగ్ అనే ఉద్యోగి ఆఫీసుకు వచ్చి గంటల తరబడి టాయిలెట్ లో గడపడంతో యాజమాన్యం మండిపడింది. విధి నిర్వహణ సమయంలో వాంగ్ దాదాపు రోజుకు 6 గంటల పాటు టాయిలెట్ లో గడుపుతున్నట్టు గుర్తించారు. 

ఒకసారి టాయిలెట్ లోకి వెళ్లాడంటే ఒక్కోసారి 3 గంటల సమయం పాటు బయటికి రాడు. ఇది ఉద్యోగ నిబంధనలకు విరుద్ధమని, సదరు ఉద్యోగిని విధుల్లో కొనసాగించలేమంటూ వేటు వేసింది. దాంతో ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. తనకు మలద్వారం సమస్య ఉందని, ఈ కారణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆ ఉద్యోగి కోర్టును కోరాడు.  

అయితే కోర్టు కంపెనీకే మద్దతుగా నిలిచింది. అనారోగ్యంతో బాధపడుతూ అధిక సమయం పాటు టాయిలెట్ లో ఉంటే విధి నిర్వహణ కుంటుపడుతుంది కదా అని ఆ ఉద్యోగి తీరు పట్ల కోర్టు వ్యాఖ్యానించింది. విధులు 8 గంటలు అయితే, 6 గంటలు టాయిలెట్లోనే గడిపితే డ్యూటీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించింది. 

వాంగ్ ఎక్కువసేపు టాయిలెట్లోనే గడపడంపై కంపెనీ తగిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించింది. దాంతో న్యాయస్థానం ఆ ఉద్యోగికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఆ కంపెనీలో ఉద్యోగానికి అనర్హుడని తీర్పు ఇచ్చింది.

More Telugu News