GVL Narasimha Rao: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పిన జీవీఎల్ నరసింహారావు

  • పోలవరంకు రూ. 12,911 కోట్ల నిధులను కేంద్రం ఇవ్వబోతోందన్న జీవీఎల్
  • కేంద్ర నిధులను గుట్టుగా తెచ్చుకుంటూ ప్రజలకు ఏదో చేస్తున్నట్టు వైసీపీ చెప్పుకుంటోందని మండిపాటు
  • ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులను ఏపీకి ఇస్తున్నామని వ్యాఖ్య
Center releasing RS 12911 cr funds for Polavaram project says GVL Narasimha Rao

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 12,911 కోట్ల నిధులను ఇవ్వబోతోందని చెప్పారు. తొలిదశ పోలవరం నిర్మాణం, డయాఫ్రం వాల్ మరమ్మతుల నిమిత్తం ఈ నిధులను ఇస్తుందని అన్నారు. దీనిపై త్వరలోనే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోబోతోందని చెప్పారు. 

ఏపీకి కావాల్సినన్ని నిధులను కేంద్రం ఇస్తోందని తెలిపారు. రెవెన్యూ లోటు కింద రూ. 10 వేల కోట్లను ఇచ్చిందని చెప్పారు. స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజీ రూపంలో రూ. 10 వేల కోట్లకు పైగా నిధులను ఇచ్చిందని తెలిపారు. తొమ్మిదేళ్ల కాలంలో ఏపీకి కేంద్రం రూ. 55 వేల కోట్లకు పైగా నరేగా నిధులను ఇచ్చిందని చెప్పారు. ఈ నిధులను కేంద్రం నుంచి గుట్టుగా తెచ్చుకున్న వైసీపీ ప్రభుత్వం... వారేదో ప్రజలకు సేవ చేసినట్టు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులను ఏపీకి కేంద్రం ఇస్తోందని చెప్పారు.

More Telugu News