Bonda Uma: వైసీపీ రౌడీ మూకలు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు: బొండా ఉమా

YSRCP goondas attacked in presence of police says Bonda Uma
  • ప్రొద్దుటూరులో లోకేశ్ పాదయాత్రపై కోడి గుడ్డుతో దాడి
  • సీఎం సొంత జిల్లాలో వైసీపీ ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చిందన్న ఉమ
  • పాదయాత్రకు భద్రతను పెంచమని డీజీపీని కోరుతామని వెల్లడి
ప్రొద్దుటూరులో నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఒక ఆకతాయి కోడుగుడ్డు విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరులో వైసీపీ మూకలు చేసిన దాడి అమానుషమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో వైసీపీ ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని... దీన్ని తట్టుకోలేక వైసీపీ దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ రౌడీ మూకలు దాడులకు పాల్పడ్డాయని చెప్పారు. లోకేశ్ పాదయాత్రకు భద్రతను పెంచమని డీజీపీని కోరుతామని తెలిపారు. నిన్న పాదయాత్రలో జరిగిన దాడిని ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు.
Bonda Uma
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News