landlord: రెంట్ విషయంలో గొడవ.. కెనడాలో యువ జంటను కాల్చి చంపిన ఇంటి యజమాని

  • చుట్టూ ఆయుధాలు పెట్టుకుని ఇంట్లో దాక్కున్న వృద్ధుడు
  • అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపైనా కాల్పులు
  • కాల్పులు జరిపి హంతకుడిని మట్టుబెట్టిన అంటారియో పోలీసులు
Landlord In Canada Fatally Shoots Young Couple Over Tenant Dispute says Cops

ఇంట్లో అద్దెకున్న వారితో గొడవ జరిగితే సాధారణంగా ఏ యజమాని అయినా ఇళ్లు ఖాళీ చేయండని చెప్తాడు.. ఇంట్లో చేరేముందు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగివ్వడానికి సతాయిస్తాడు. కానీ కెనడాలో ఓ ఇంటి యజమాని మాత్రం తన ఇంట్లో అద్దెకున్న యువజంటను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆపై పోలీసులపైనా కాల్పులు జరిపాడు. వారు తిరిగి కాల్పులు జరపడంతో బుల్లెట్ గాయాలతో కన్నుమూశాడు. కెనడాలోని అంటారియాలో జరిగిందీ ఘటన.

సిటీకి చెందిన ఓ 57 ఏళ్ల వృద్ధుడు తన ఇంట్లోని కింది పోర్షన్ ను కారిస్సా మాక్ డొనాల్డ్, ఎరోన్ స్టోన్ అనే జంటకు అద్దెకు ఇచ్చాడు. కొన్నాళ్లపాటు అంతా బాగానే ఉన్నప్పటికీ ఇటీవల అద్దెకున్నవారితో వృద్ధుడు గొడవపడ్డాడు. రెంట్ చెల్లించే విషయంలోనో లేక మరో విషయంలోనో మొదలైన ఈ గొడవ రోజురోజుకూ పెరిగింది. ఓ రోజు మాక్ డొనాల్డ్, స్టోన్ ఇద్దరూ బయటకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇంట్లో నంచి బయటకు రాగానే యజమాని వారితో గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో వృద్ధుడు తన తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు.

దీంతో మాక్ డొనాల్డ్, స్టోన్ ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయారు. ఆ తర్వాత వృద్ధుడు తన ఇంట్లోకి వెళ్లి తలుపులు బిడాయించుకున్నాడు. తన ఆయుధాలన్నీ తీసి చుట్టూ పెట్టుకుని కూర్చున్నాడు. కాల్పుల శబ్దం విని చుట్టుపక్కల వారు ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వృద్ధుడిని లొంగిపోవాలని కోరారు. అయినా వృద్ధుడు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. గంటల తరబడి ఈ ప్రహసనం కొనసాగింది. పోలీసులతో వాదించిన వృద్ధుడు చివరకు కాల్పులు జరపడం మొదలు పెట్టాడు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జరపడంతో బుల్లెట్ గాయాలతో వృద్ధుడు చనిపోయాడు.

More Telugu News