నారా లోకేశ్ పై కోడిగుడ్డు విసిరిన ఆకతాయి.. చితకబాదిన టీడీపీ కార్యకర్తలు
- ప్రొద్దుటూరులో పాదయాత్ర సందర్భంగా ఘటన
- లోకేశ్ భద్రతా సిబ్బందిపై పడ్డ కోడిగుడ్డు
- ఆకతాయిని వెంబడించి పట్టుకున్న టీడీపీ శ్రేణులు
ఈ సందర్భంగా పోలీసుల తీరుపై లోకేశ్ మండిపడ్డారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటన జరిగిన స్థలంలోనే నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు సర్ది చెప్పడంతో అక్కడి నుంచి విడిది కేంద్రానికి వెళ్లిపోయారు. మరోవైపు కోడిగుడ్డు విసిరిన ఆకతాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.