స్టీరింగ్ ను ముద్దాడి, బస్సును కౌగిలించుకుని.. నెటిజన్లను కదిలిస్తున్న డ్రైవర్ భావోద్వేగం.. వీడియో ఇదిగో!
- పదవీ విరమణ రోజు కన్నీటి పర్యంతమైన ఉద్యోగి
- ఫుట్ బోర్డుకు దండం పెట్టిన తమిళనాడు డ్రైవర్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
సంవత్సరాల తరబడి బస్సుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటితో బస్సును హగ్ చేసుకున్నారు. నేటితో తమ బంధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. ఇదంతా తోటి ఉద్యోగులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.