Nara Lokesh: ​యువగళం అంటేనే వైసీపీ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు: నారా లోకేశ్

  • ప్రొద్దుటూరులో లోకేశ్ యువగళం
  • వైసీపీ ఎమ్మెల్యేకి జ్వరం వచ్చిందన్న లోకేశ్
  • ఎమ్మెల్యే భయపడ్డాడంటూ ఎద్దేవా
  • బెట్టింగ్ కింగ్ రాచమల్లు అవినీతి అంటూ విమర్శనాస్త్రాలు
Lokesh speech in Proddutur

ప్రొద్దుటూరులో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. పాదయాత్ర దారిలో భారీగా రోడ్లపైకి వచ్చిన యువకులు, మహిళలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ప్రొద్దుటూరులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు పట్టణంలో పోస్టర్లు వేయడంతో, టీడీపీ కార్యకర్తలు హు కిల్డ్ బాబాయ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్లకార్డులను తీసేయాలంటూ డీఎస్పీ నాగరాజు... లోకేశ్ వద్దకు వచ్చి అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు తీసుకొని మేము పాదయాత్ర చేస్తున్నాం... మమ్మల్ని రెచ్చగొట్టేలా వైసీపీ వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని లోకేశ్ డీఎస్పీని నిలదీశారు. దాంతో ఆయన అక్కడ నుండి వెళ్లిపోయారు. 

ఇక ప్రొద్దుటూరులో లోకేశ్ సభకు భారీ జన స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజానీకాన్ని చూసి లోకేశ్ ఉత్సాహంగా ప్రసంగించారు.

ప్రొద్దుటూరు పవర్ అదుర్స్

ప్రొద్దుటూరు పేరు చెప్పగానే పౌరుషం గుర్తొస్తుంది. సీతారాములు నివసించిన పుణ్యభూమి ప్రొద్దుటూరు. కన్యకా పరమేశ్వరి ఆలయం, శోషన్ వల్లి దర్గా, ఆర్సీఎం చర్చి ఉన్న ఆధ్యాత్మిక నేల ప్రొద్దుటూరు. బంగారం, పత్తి వ్యాపారంలో మిమ్మల్ని కొట్టిన వారు లేరు. అందుకే ప్రొద్దుటూరుని సెకండ్ ముంబై అని కూడా అంటారు. దసరా ఉత్సవాలు ఇక్కడ అద్భుతంగా నిర్వహించి సెకండ్ మైసూర్ గా పేరు తెచ్చుకున్నారు. ఎంతో చరిత్ర ఉన్న ప్రొద్దుటూరులో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

బాబాయ్ హత్య జగనాసుర రక్తచరిత్రని తేలిపోయింది!

ఈరోజు ఉమ్మడి కడప జిల్లా ప్రజల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను... హూ కిల్డ్ బాబాయ్? సొంత పత్రిక, ఛానల్ ఉందని బాబాయ్ ని లేపేసి గుండెపోటు అన్నారు... నారాసుర రక్తచరిత్ర అని రాశారు... కానీ, బాబాయ్ ఆత్మ వెంటాడింది... నిజం బయటకి వచ్చింది. అది జగనాసుర రక్త చరిత్ర అని తేలిపోయింది. 

అబ్బాయిలే కిల్డ్ బాబాయ్ అని ఏకంగా చెల్లే రహస్యంగా సాక్ష్యం చెప్పింది. కేసు నుండి బయటపడటానికి జగన్ ఢిల్లీ వెళ్లి అందరి కాళ్లు పట్టుకుంటున్నాడు. వివేకా గారిని అత్యంత క్రూరంగా చంపేసిన అబ్బాయిలు దేవుడు వేసే శిక్ష నుండి తప్పించుకోలేరు.

ఎమ్మెల్యేకి జ్వరం వచ్చింది!

యువగళం దెబ్బకి వైసీపీ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. ప్రొద్దుటూరులోకి నేను ఎంటర్ అయ్యే వారం రోజుల ముందే ఇక్కడ ఎమ్మెల్యేకి జ్వరం వచ్చింది. ఎంత భయపడ్డాడో తెలుసా? ముందే ప్రెస్ మీట్లు, ఊరంతా ఫ్లెక్సీలు కట్టాడు. అదీ యువగళం సత్తా. మావాళ్లు మీ ఉడత ఊపులకు భయపడే బ్యాచ్ కాదు. అడ్డొస్తే ఉతికి ఆరేసే బ్యాచ్ మాది. కర్రసాము చేస్తూ కామెడీ పీస్ కింద ఎలా పడ్డాడో చూశారు కదా!

బెట్టింగ్ కింగ్ రాచమల్లు అవినీతి లీలలు

ప్రొద్దుటూరుని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాడని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ ఆయన ప్రొద్దుటూరుని గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా, దొంగనోట్లు, ఇసుక అక్రమ రవాణాకి అడ్డాగా మార్చాడు. ఏకంగా సొంత ఇంటినే అసాంఘిక కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మార్చుకున్నాడు. 

చేసేవి లుచ్చా పనులు పైకి దానకర్ణుడిలా కలరింగ్ ఇస్తున్నాడు. అందుకే ఎమ్మెల్యే పేరు మార్చాను ఆయన శివప్రసాద్ కాదు బెట్టింగ్ ప్రసాద్. నేను పాదయాత్రకు రాకముందే భయంతో ప్యాంటు తడుపుకున్నాడు ఈ బెట్టింగ్ ప్రసాద్. జేబులో డబ్బులు లేక బ్రేక్ ఇన్స్పెక్టర్ వేషం వేసుకొని రోడ్లపై వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేసిన రోజులు మర్చిపోయావా బెట్టింగ్ ప్రసాద్?

బెట్టింగ్ ప్రసాద్ ఎంత తింగరోడో తెలుసా... అయిపోయిన మ్యాచ్ రీ టెలీకాస్ట్ అవుతుంటే బెట్టింగ్ వేశాడట!. ఇంట్లో ఆ సీన్ చూసిన కార్యకర్తలు బయటకు వచ్చి తెగ నవ్వుకున్నారట! 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత కారు ఈఎంఐ, అద్దె ఇంట్లో ఉన్న స్థితి నుండి ఇప్పుడు వేల కోట్ల అధిపతి అయ్యాడు బెట్టింగ్ ప్రసాద్. ప్రొద్దుటూరుకు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే ఒకరైతే నామినేటెడ్ ఎమ్మెల్యేలు మరో ఇద్దరు. ఆర్బికే... రాచమల్లు, బంగారు రెడ్డి, కిరణ్ రెడ్డి.. ఈ ముగ్గురు ప్రొద్దుటూరుని కేకులా కోసుకొని తినేస్తున్నారు.

*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1456.6 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 10.5 కి.మీ.*

*114 వరోజు పాదయాత్ర వివరాలు (2-6-2023)*

*మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):*

మధ్యాహ్నం

2.00 – కొత్తపల్లి పిఎన్ఆర్ ఎస్టేట్స్ వద్ద క్యాంప్ సైట్ లో తటస్థ ప్రముఖులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – కొత్తపల్లి పిఎన్ఆర్ ఎస్టేట్స్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.

5.00 – పాదయాత్ర మైదుకూరు నియోజకవర్గంలోకి ప్రవేశం.

5.25 – మైదుకూరు నియోజకవర్గం నాగులాపల్లి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

6.05 – ఖాదర్ పల్లిలో స్థానికులతో సమావేశం.

6.50 – చాపాడులో స్థానికులతో మాటామంతీ.

7.00 – సీతారాంపురం క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

7.20 – చియ్యపాడు క్రాస్ వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.

7.40 – అల్లపుదేవులలో స్థానికులతో మాటామంతీ.

7.55 – కేతవరం క్రాస్ వద్ద రైతులతో సమావేశం.

8.05 – పుల్లయ్య సత్రం వద్ద స్థానికులతో మాటామంతీ.

8.25 – విశ్వనాథపురంలో రైతులతో సమావేశం.

8.40 – విశ్వనాథపురం విడిది కేంద్రంలో బస.

******

More Telugu News