KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

KCR greeting for Telangana formation day
  • తెలంగాణప్రజల హృదయాలు ఆనందం, గర్వంతో నిండుకున్న సందర్భమని వ్యాఖ్య
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు గర్వించే క్షణమన్న కేసీఆర్
  • తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారన్న సీఎం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల హృదయాలు ఆనందం, గర్వంతో నింపుకున్న సందర్భమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు గర్వించే క్షణం ఇది అన్నారు. ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అన్ని వర్గాలవారు పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం ఎంతోమంది త్యాగాలు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమ అమరవీరులకి, వారి అంకితభావానికి హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. ఉద్యమ సమయంలో ఎన్నో ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని, విద్యార్థులు, యువకులు ఎన్నో త్యాగాలు చేశారన్నారు.
KCR

More Telugu News