Allu Aravind: ప్రతి ఒక్కరినీ తుపానులోకి తీసుకెళ్లే సినిమా '2018': థ్యాంక్యూ మీట్ లో అల్లు అరవింద్

2018 Thank You Meet
  • మలయాళం నుంచి వచ్చిన '2018'
  • అక్కడ 200 కోట్ల మార్క్ దిశగా వెళుతున్న సినిమా
  • తెలుగులో 4 రోజుల్లో 6 కోట్ల వసూళ్లు 
  • ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అంటూ అల్లు అరవింద్ వ్యాఖ్య

మలయాళంలో మే 5వ తేదీన విడుదలైన '2018' అక్కడ భారీ విజయాన్ని సాధించింది. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, అక్కడ రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. మే 26వ తేదీన తెలుగులో విడుదలైన ఈ సినిమా, ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ 'థ్యాంక్యూ మీట్'ను నిర్వహించింది.

ఈ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "నేను యూఎస్ లో ఉన్నప్పుడు బన్నీ వాసు కాల్ చేసి ఈ సినిమాను గురించి చెప్పాడు. ఈ మధ్య కాలంలో ఇతర భాషల్లోని మంచి సినిమాలను మనమే రిలీజ్ చేస్తున్నాం గనుక, ఈ సినిమాను కూడా మనమే రిలీజ్ చేయాలి. సెకండాఫ్ ఈ సినిమాకి హైలైట్" అని చెప్పాడు. 

"ఈ సినిమాను ఈ రోజునే చూశాను .. నిజంగా దర్శకుడు అలా ఒక తుఫానులోకి తీసుకెళ్లిపోయాడు. ఇది థియేటర్స్ లోనే చూడవలసిన సినిమా. రెగ్యులర్ సినిమాల్లో ఉండవలసినవేవీ ఇందులో లేవు .. ఇందులో ఉన్నదల్లా ఎమోషన్. మలయాళంలో 160 కోట్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగులో 4 రోజుల్లో 6 కోట్లను వసూలు చేసింది. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఇది" అని అన్నారు. 

  • Loading...

More Telugu News