Sanjay Raut: సచిన్, కోహ్లీ మాదిరి రాహుల్ గాంధీ గొప్ప ఫామ్ లో ఉన్నారు: సంజయ్ రౌత్ ప్రశంసలు

Despite disqualification Rahul Gandhi in great form like Tendulkar Kohli says Sanjay Raut
  • అమెరికాలో రాహుల్ ప్రసంగాలకు మంచి స్పందన వస్తోందన్న సంజయ్ రౌత్
  • ఎంపీగా అనర్హత వేటు పడినా పరిస్థితిని చక్కగా హ్యాండిల్ చేస్తున్నారని ప్రశంస
  • విదేశాల్లో గతంలో మోదీ ఏం చేశారో.. రాహుల్ అదే చేస్తున్నారని వ్యాఖ్య

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసలు కురిపించారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ప్రసంగాలకు అక్కడ మంచి స్పందన వస్తోందన్నారు. రాహుల్ ప్రసంగాలను పెద్ద సంఖ్యలో ప్రజలు వింటున్నారని, ఆయన గొప్ప ఫామ్‌లో ఉన్నారని అన్నారు.

‘‘సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మాదిరి రాహుల్ గాంధీ గొప్ప ఫామ్ లో ఉన్నారు. ఎంపీగా అనర్హత వేటు పడి, తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసినప్పటికీ, రాహుల్ గాంధీ పరిస్థితిని చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు’’ అని అన్నారు. 2014కి ముందు, తర్వాత మోదీ ఏం చేశారో.. రాహుల్ గాంధీ కూడా దేశం బయట అదే చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం అమెరికాలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత సంతతి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానిపై బుధవారం రాహుల్‌ విమర్శలు చేశారు. తాజాగా కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ లో ఆయన మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో లోక్‌సభ సభ్యత్వం రద్దును ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించలేదని చెప్పారు. తర్వాత మాత్రం అది తనకు లభించిన పెద్ద అవకాశంగా భావించానని, రాజకీయాలంటే అలానే ఉంటాయని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News