Paradise Biryani: హైదరాబాదులో అనాథ బాలలకు 'ప్యారడైజ్' బిర్యానీ విందు

  • కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ప్యారడైజ్ ఉదారత
  • ఎల్బీ నగర్ లోని అనాథ విద్యార్థి గృహ బాలలకు ఒక పూట భోజనం
  • ప్యారడైజర్ సిగ్నేచర్ బిర్యానీ, సైడ్ డిష్ లు, డిజర్ట్ లతో విందు 
Paradise Biryani Nourishes 150 Orphan Kids with Biryani Feast

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్యారడైజ్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ అని తెలిసిందే.  ఆ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)ను చాటుకుంటూ హైదరాబాదులో అనాథ బాలలకు బిర్యానీతో విందు ఏర్పాటు చేసింది. 

ఎల్బీ నగర్ లో ఉన్న అనాథ విద్యార్థి గృహ అనాథాశ్రమంలోని 150 మంది బాలలకు రుచికరమైన బిర్యానీ అందించింది. తద్వారా వారి ముఖాల్లో ఒక పూట సంతోషం నింపింది. ఈ విందు భోజనంలో ప్యారడైజ్ కే ప్రత్యేకమైన సిగ్నేచర్ బిర్యానీ, వివిధ రకాల ఇతర వంటకాలు, పలు రకాల డిజర్ట్ (స్వీట్లు, ఐస్ క్రీములు తదితర) ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. 

ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్  వైస్ ప్రెసిడెంట్ మరియు మార్కెటింగ్ హెడ్ కుశాగ్ర గుప్తా మాట్లాడుతూ "ప్రతి పిల్లవాడు పౌష్టికాహార భోజనానికి అర్హుడని మరియు ఆనంద క్షణాలను అనుభవించే అవకాశం ఉందని మేము విశ్వసిస్తున్నాము. వారికి  సంతోషకరమైన బిర్యానీ విందు అందించగలగడం మరియు ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను సృష్టించే అవకాశం  లభించటం మా అదృష్టం" అని అన్నారు. 

ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల జీవితాలను మెరుగుపర్చడంలో నిరంతర మద్దతు అందిస్తున్న ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్‌కు అనాథాశ్రమం నిర్వాహకులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

More Telugu News