Dhoni mania: ధోనీ గొప్పతనాన్ని వర్ణించిన పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్

Legend like Gavaskar MS gets highest of praises from across the border says IPL will be remembered for Dhonimania
  • ధోనీమానియాగా ఈ సీజన్ గుర్తుండిపోతుందన్న రమీజ్ రాజా
  • సునీల్ గవాస్కర్ షర్ట్ పై ధోనీ ఆటోగ్రాఫ్ గొప్ప కాంప్లిమెంట్ అని వ్యాఖ్య
  • ఇతర స్టార్లనూ ప్రస్తావించిన పాక్ క్రికెట్ బోర్డ్ మాజీ చైర్మన్
చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గొప్పతనాన్ని పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ రమీజ్ రాజా సైతం మెచ్చుకున్నాడు. తన సారథ్యంలో చెన్నై ఫ్రాంచైజీని ఐదో విడత విజేతగా నిలిపిన ధోనీపై ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్ల నుంచి అభినందనల వర్షం కురుస్తుండడం తెలిసిందే. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మాజీ చైర్మన్ రమీజ్ రాజా కూడా చేరిపోయాడు. తన యూట్యూబ్ చానల్ లో దీనిపై ఒక వీడియో చేశాడు. 

ఈ ఐపీఎల్ సీజన్ యెల్లో కలర్ గా, ధోనీకి గుర్తుండిపోతుందని రమీజ్ పేర్కొన్నారు. ధోనీ వినయం, ధోనీ మానియా, అతడి కెప్టెన్సీ, అతడి ప్రశాంత చిత్తం, అతడి కీపింగ్ ఎన్నో తరాలకు గుర్తుండిపోతాయన్నాడు. ‘‘సునీల్ గవాస్కర్ వంటి ఓ లెజెండ్ తన షర్ట్ పై ధోనీ ఆటోగ్రాఫ్ కోరడం అన్నది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ధోనీకి ఇంతకుమించిన గొప్ప కాంప్లిమెంట్ ఉండదు’’ అని రాజా పేర్కొన్నాడు. 

ఈ సీజన్ లో ప్రతిభ చూపించిన శుభ్ మాన్ గిల్, రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ను కూడా రాజా ప్రస్తావించాడు. ఈ స్టార్లు వచ్చే ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకులను అలరిస్తారని అభిప్రాయపడ్డాడు. పెద్ద స్టార్లు బెంచ్ కే పరిమితం అయితే, చిన్న దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ సీజన్ లో మంచి ప్రతిభ చాటిన అంశాన్ని కూడా రమీజ్ రాజా ప్రస్తావించాడు. భారీ ధర పెట్టి కొనుక్కున్న ఆటగాళ్లు ఫ్రాంచైజీలను ఉసూరుమనిపించిన అంశాన్ని పరోక్షంగా గుర్తు చేశాడు.
Dhoni mania
Legend
Gavaskar
MS Dhoni
autograph
ramiz raja

More Telugu News