Sensex: స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్

  • 346 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 99 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులపై తీవ్ర ప్రభావం
Markets ends in losses

స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఈరోజు నష్టాలతో ప్రారంభమయిన స్టాక్ మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతను మన మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 346 పాయింట్లు కోల్పోయి 62,622కి పడిపోయింది. నిఫ్టీ 99 పాయింట్లు పతనమై 18,534 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ బ్యాంక్ (2.35%), టెక్ మహీంద్రా (2.08%), భారతి ఎయిర్ టెల్ (1.92%), ఏసియన్ పెయింట్స్ (1.67%), సన్ ఫార్మా (1.60%). 

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-2.41%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.07%), రిలయన్స్ (-2.03%), హెచ్డీఎఫ్సీ లిటిటెడ్ (-1.67%), ఎన్టీపీసీ (-1.56%).

More Telugu News