Kamala Ganesh: 'మహానటి'లో మా డాడీ గురించి తప్పుగానే చూపించారు: కమల గణేశన్

Kamala Ganesh Interview
  • జెమినీ గణేశన్ గురించి ప్రస్తావించిన కూతురు
  • ఆయన చాలా హ్యాండ్సమ్ .. డీసెంట్ అని వ్యాఖ్య 
  • ఆయనను చూడటానికి అమ్మాయిలు ఎగబడేవారని వెల్లడి 
  • తమతో సావిత్రి చాలా చక్కగా మాట్లాడేదని వివరణ

జెమినీ గణేశన్ తో సావిత్రి వివాహం జరిగిన సంగతి .. ఆ తరువాత వాళ్లిద్దరి మధ్య దూరం పెరిగిన మాట అందరికీ తెలిసిందే. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెమినీ గణేశన్ కూతురు కమల గణేశన్ మాట్లాడుతూ .. " మా డాడీ చాలా హ్యాండ్సమ్ గా ఉండేవారు. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ ఎంతో బాగుండేది. పిల్లలందరినీ ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవారు" అన్నారు. 

"ప్రతిరోజు కూడా మా డాడీని చూడటానికి ఎంతోమంది అమ్మాయిలు వచ్చేవారు. తమని పెళ్లి చేసుకోమని చాలామంది అడిగేవారు. తనకి ఆల్రెడీ పెళ్లి అయిందని ఆయన వారికి నచ్చజెప్పి పంపించేవారు. ఇక ఆ తరువాత ఆయన సావిత్రి గారిని పెళ్లి చేసుకోవడమనేది విధిరాతగానే చెప్పుకోవాలి. అయితే పెళ్లి చేసుకుందామని డాడీ ఎవరినీ ఫోర్స్ చేయలేదు" అని చెప్పారు. 

మా డాడీకి మంచి స్టార్ ఇమేజ్ ఉండేది. ఆయనకి అవకాశాలు లేక ఇబ్బంది పడ్డారనడంలో నిజం లేదు. ఆయన గురించి 'మహానటి'లో తప్పుగానే చూపించారు. సావిత్రిగారిని నేను చూశాను .. ఆమె మాతో చాలా చక్కగా మాట్లాడేవారు. మా అమ్మగారు కూడా ఆమెతో చాలా ఆత్మీయంగా ఉండేవారు" అంటూ చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News