YS Sunitha: 'అవినాశ్ రెడ్డిపై చర్యలు తీసుకోండి' అంటూ వైఎస్ సునీత మెమో.. పరిగణనలోకి తీసుకోని హైకోర్టు

  • అవినాశ్ తల్లికి సర్జరీ జరగలేదని మెమోలో పేర్కొన్న సునీత
  • అవినాశ్ కు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం  
  • సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం
YS Sunitha files memo in TS High court

వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. మరోవైపు వివేకా కూతురు సునీత హైకోర్టులో మెమో దాఖలు చేశారు. అవినాశ్ తల్లికి ఆరోగ్యం బాగోలేదని, దీంతో ఆమెను అవినాశ్ దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందని గత వారం వాదనల సందర్భంగా కోర్టుకు అవినాశ్ లాయర్ తెలిపారు. అవినాశ్ కు బెయిల్ ఇవ్వాలని, అవినాశ్ తల్లి అనారోగ్యం విషయంలో తాము తప్పు చెపితే తమపై చర్యలు తీసుకోవచ్చని కోర్టుకు తెలిపారు. 

ఈ క్రమంలో సునీత మెమో దాఖలు చేశారు. అవినాశ్ తల్లికి ఎలాంటి సర్జరీ జరగలేదని, అవినాశ్ పై చర్యలు తీసుకోవాలని మెమోలో ఆమె కోరారు. అయితే ఆమె మెమోను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అవినాశ్ కు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు హైకోర్టు బెయిల్ ఆర్డర్ ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసే అవకాశం ఉంది. 

More Telugu News