Pub: కస్టమర్లను ఆకర్షించేందుకు వన్య ప్రాణుల ప్రదర్శన... హైదరాబాదులో పబ్ యజమాని అరెస్ట్

Pub owner arrest in Hyderabad after illegally exhibiting animals
  • జోరా పబ్ లో వన్యప్రాణులతో ప్రదర్శన
  • పబ్ యజమాని వినయ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అటవీశాఖ అధికారులకు అప్పగింత
హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వైల్డ్ జంగిల్ పార్టీ పేరిట జంతువులను ప్రదర్శిస్తున్నట్టు జోరా పబ్ పై ఆరోపణలు వచ్చాయి. అనుమతి లేకుండా వన్యప్రాణుల ప్రదర్శన ఏర్పాటు చేశాడని, వన్యప్రాణులను బంధించాడన్న ఆరోపణలపై జోరా నైట్ పబ్ యజమాని వినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఓ యువకుడు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు, సైదాబాద్ లో ఉన్న ఎక్సోటిక్ యానియల్స్ పెట్ షాప్ పై అటవీశాఖ అధికారులు దాడులు చేశారు.
Pub
Exotic Animals
Police
Hyderabad

More Telugu News