Hardik Pandya: చెన్నై గెలుపుపై చక్కగా స్పందించిన హార్థిక్ పాండ్యా

If I Had To Lose Hardik Pandya Glorious Tribute To MS Dhoni After IPL Final Defeat
  • టైటిల్ కోల్పోవాల్సి వస్తే మహీ భాయ్ చేతిలో ఓడిపోతానన్న పాండ్యా
  • మంచి వాళ్లకు మంచే జరుగుతుందని వ్యాఖ్య
  • తాము బాగా ఆడామని, సీఎస్కే మెరుగ్గా ఆడిందని ప్రకటన
ఐపీఎల్ టైటిల్ పోరులో తాము ఓడినప్పటికీ, గుజరాత్ టైటాన్స్ సారథి హార్థిక్ పాండ్యా సానుకూలంగా స్పందించాడు. క్రీడాస్ఫూర్తిని చాటాడు. అంతేకాదు, మహేంద్రసింగ్ ధోనీ పట్ల తన అభిమానాన్ని కూడా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఫైనల్ లో ఓటమి అనంతరం పాండ్యా మీడియాతో మాట్లాడాడు. తన జట్టును చూసి గర్వపడుతున్నట్టు చెప్పాడు. తాను ఐపీఎల్ టైటిల్ ను కోల్పోవాల్సి వస్తే, అది సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేతిలో ఓడిపోతానని వ్యాఖ్యానించాడు. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ టైటిల్ గెలవడం విధిగా పేర్కొన్నాడు.

మంచి వాళ్లకు మంచి పనులు జరుగుతాయని తాత్వికంగా చెప్పాడు. తనకు తెలిసిన అత్యుత్తమ ఆటగాళ్లలో మహీ భాయ్ ఒకడిగా పేర్కొన్నాడు. ‘‘ఎంఎస్ ధోనీని చూసి ఎంతో సంతోషిస్తున్నాను. విధి ఇలా రాసింది. నేను ఓడిపోవాల్సి వస్తే, అది అతడి కోసం ఓడిపోతా. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది. నాకు తెలిసిన గొప్ప వ్యక్తుల్లో అతడు కూడా ఒకడు. దేవుడు దయ చూపుతాడు. నా పట్ల కూడా ఈ రోజు దయ చూపించాడు’’ అని పాండ్యా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. తాము ఎన్నో బాక్సులను టిక్ చేసినట్టు పాండ్యా చెప్పాడు. హృదయపూర్వకంగా ఆడినట్టు తెలిపాడు. సీఎస్కే మెరుగ్గా ఆడిందని ప్రశంసించాడు.
Hardik Pandya
MS Dhoni
IPL Final
reaction

More Telugu News