Mumbai: నడిపేది ఆడీ కారు.. అమ్మేది తేనీరు.. కుర్రాళ్ల వ్యాపార మంత్రం

  • ముంబై కుర్రాళ్ల ఆదాయ మార్గం
  • ఆడి కారులో వచ్చి వేడి వేడి టీ, కాఫీ విక్రయం
  • ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
This Mumbai chaiwala has set up a tea stall in his Audi Watch viral video

చేసే పని ఏదయినప్పటికీ, సానుకూల దృక్పథం ఉన్నప్పుడే ముందుకు సాగిపోగలరు. అంతేకాదు చేసే పని పట్ల గౌరవం, ఇష్టం, అంకిత భావం కూడా అవసరమే. ఇందుకు నిదర్శనమే ఈ ముంబై కుర్రాళ్లు. ఇంటర్నెట్ లో ఇప్పుడు వీరు చేసే పని గురించి పెద్ద ప్రచారమే జరుగుతోంది. ముంబైలోని లోఖండ్ వాలా బ్యాక్ రోడ్డు వైపు ఒక్కసారి వెళితే వీరిని చూడొచ్చు. పక్కనే ఆడి కారు, డిక్కీలో సామాను. దానిపక్కనే వేడి వేడి ఛాయ్ రెడీ చేస్తుండడం కనిపిస్తుంది. ఛాయ్ అమ్మడం అయిపోయిన తర్వాత ఎంచక్కా ఆడి కారులో తిరిగి వెళ్లిపోతారు. 

డబ్బులు లేక కాదు. పార్ట్ టైమ్ ఆదాయం కోసమే వీరు టీ షాప్ ఎంపిక చేసుకున్నారు. ఈ స్టాల్ ను అమిత్ కాశ్యప్, మను శర్మ కలసి ఏర్పాటు చేశారు. వీరిని చూసి ఎంతో మంది ఆశ్చర్యపోతుంటే, స్ఫూర్తిగా తీసుకునే వారు కూడా ఉన్నారు. ఆడి కారు ఉన్నా ఛాయ్ అమ్మడం ఏంటా? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డబ్బున్నోళ్లు గరీబోళ్ల మాదిరిగా ఈ ఛాయ్ అమ్మడం ఏంటా? అని ఒక నెటిజన్ ప్రశ్నించడం గమనార్హం. ‘సిగ్గు పడకుండా సంపాదించాలి, దేనికీ లోటు లేకుండా గౌరవంగా జీవించాలి’ అన్న సందేశంతో ఈ కుర్ర వ్యాపారవేత్తలు సాగిపోతున్నారు. (వీడియో కోసం)

More Telugu News