Rahul Gandhi: మధ్యప్రదేశ్ లో 150 సీట్లు గెలుస్తాం: రాహుల్ గాంధీ

Congress will win 150 seats in Madhya Pradesh says Rahul Gandhi
  • మధ్యప్రదేశ్ లో కూడా ఘన విజయం సాధించబోతున్నామన్న రాహుల్
  • ఈరోజు రాహుల్, ఖర్గేలతో భేటీ అయిన మధ్యప్రదేశ్ కీలక నేతలు
  • రాష్ట్ర ప్రధాన సమస్యలపై చర్చించామన్న కమల్ నాథ్
త్వరలో జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి తాము అంతర్గత సమీక్ష నిర్వహించామని... కర్ణాటకలో 136 సీట్లు గెలిచామని, మధ్యప్రదేశ్ లో 150 సీట్లు గెలుస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్ కు చెందిన పార్టీ కీలక నేతలు ఈరోజు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ అయ్యాయి. భేటీ అయిన వారిలో మధ్యప్రదేశ్ పార్టీ చీఫ్ కమల్ నాథ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కమల్ నాథ్ మాట్లాడుతూ ఎన్నికలకు 4 నెలల సమయం మాత్రమే ఉందని చెప్పారు. మధ్యప్రదేశ్ భవిష్యత్తు, ప్రధాన సమస్యలపై సమావేశంలో చర్చించామని తెలిపారు.
Rahul Gandhi
Mallikarjun Kharge
Madhya Pradesh
Congress

More Telugu News