Bellana Chandrasekhar: బీజేపీకి ఏపీతో పనిలేదు.. ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి లేదు: విజయనగరం ఎంపీ

ysrcp mp chandrasekhar comments on ap special status
  • ప్రత్యేక హోదాపై పార్లమెంటులో పోరాడుతున్నామన్న ఎంపీ చంద్రశేఖర్
  • బీజేపీకి 300 మందికి పైగా ఎంపీలు ఉండటంతో.. తమ మాటలను వినట్లేదని వ్యాఖ్య
  • అయినా తాము పోరాటం చేస్తూనే ఉన్నామని వెల్లడి
బీజేపీకి ఆంధ్రప్రదేశ్ తో అవసరం లేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో 21 మంది లోక్ సభ ఎంపీలు, 8 మంది రాజ్యసభ సభ్యులం పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పారు. ఈ రోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. తితిదే అధికారులు ఎంపీకి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయం బయట ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘దేశంలో బీజేపీ బలంగా ఉంది. మన అవసరం వాళ్లకు లేదు. వాళ్లకు 300 మందికి పైగా ఎంపీలు ఉండటంతో.. మనం ఎంత చెప్పినా ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా మేం పోరాటం చేస్తూనే ఉన్నాం. మా విధానం, విధి కూడా అదే’’ అని అన్నారు. త్వరలోనే మంచి పరిణామం జరుగుతుందని అన్నారు.
Bellana Chandrasekhar
AP Special Status
BJP
YSRCP
Vijayanagaram

More Telugu News