Vijayasai Reddy: టీడీపీ మేనిఫెస్టోపై విజయసాయిరెడ్డి స్పందన

  • రాజమండ్రి మహానాడులో చంద్రబాబు హామీల జల్లు
  • ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే శాంపిల్ మేనిఫెస్టో
  • అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో
  • 'మాయా' ఫెస్టో అంటూ విజయసాయి వ్యంగ్యం
Vijayasai Reddy opines on TDP manifesto

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మరికొన్ని నెలల సమయం ఉండగానే, టీడీపీ మేనిఫెస్టో ప్రకటించి సమర సన్నద్ధత చాటింది. ఈ శాంపిల్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా టీడీపీ మేనిఫెస్టో అంశాలే కనిపిస్తున్నాయి. 

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (జిల్లా పరిధిలో), ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు, 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.1500, ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అని ఇవాళ చంద్రబాబు ప్రకటించారు. 

దీనిపై వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. అమలు చేయమంటారేమో అని గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోనే మాయం చేశారని విమర్శించారు. ఇప్పుడు అన్నీ ఉచిత హామీలతో మేనిఫెస్టో ప్రకటించారని వెల్లడించారు. ఈ 'మాయా' ఫెస్టోలో ఎవరు పడతారంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

More Telugu News