Ayyanna Patrudu: నా సొగసు చూడు మామయ్యా అంటే ఏటి చూత్తాం మనం!: అయ్యన్న సెటైర్లు

  • రాజమండ్రిలో మహానాడు
  • వాడీవేడిగా ప్రసంగించిన అయ్యన్నపాత్రుడు
  • వైసీపీ మంత్రులపై విమర్శనాస్త్రాలు
  • టీడీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపు 
Ayyanna satires on YCP ministers

రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. అందుకు కార్యకర్తల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. చంద్రబాబు కోసం కాదు... రాష్ట్రం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించాలని అయ్యన్న పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం కార్యకర్తలు పోరాడాలని సూచించారు. 

జగన్ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీయేనని విమర్శించారు. పింఛను రూ.3 వేలు ఇస్తామని చెప్పి జనాలను మోసం చేశారని, 25 లక్షల ఇళ్లు ఇస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. 

"ఈ దొంగోడు గెలిచాడు... రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మళ్లీ ఈ దొంగోడు గెలిస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది... మన కిడ్నీలు కూడా అమ్మేస్తాడు. దాంట్లో అనుమానమే లేదు. అందుకే రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది" అని వ్యాఖ్యానించారు. ఇళ్లకు పార్టీ రంగులు వేస్తున్నారని, ముఖానికి కూడా రంగులేసుకోమను నా***ని అంటూ ఓ బూతు మాట వదిలారు. 

"వైసీపీ మంత్రులు ఒక్కరికైనా సబ్జెక్ట్ తెలుసా? ఏం చేశార్రా బాబూ అంటే... అనంతపూర్ ఎంపీ ప్యాంటు విప్పుతాడు. ఏం చేశావురా అంటే ఇంకో మంత్రి షర్ట్ విప్పేస్తాడు. ఒక మంత్రేమో అరగంట చాలంటాడు... ఇంకో మంత్రేమో గంట చాలంటాడు. అరగంట దేనికో, గంట దేనికో ఎవడికీ అర్థంకాదు. 

తణుకు ఎమ్మెల్యే ఉన్నాడు... పంట తడిసిపోయిందండీ అని రైతులు అడిగితే పంట తడిసిపోతే నేనం చేస్తాన్రా అన్నాడు. దాంతో రైతులకు కోపం వచ్చింది... మంత్రిగారికి కూడా కోపం వచ్చింది. రైతును పట్టుకుని వెర్రి పప్పగా అన్నాడు. పప్ప అంటే అర్థం నాకు తెలీదేటి మరి! మళ్లీ ఆ మంత్రి మాట్లాడుతున్నాడు... పప్ప అంటే చిన్ని, నాన్న, పిన్ని అంట. పప్ప అంటే బుజ్జికన్న అంట. ఇలాంటి మంత్రులు దాపరించారు మనకు. 

ఇక రోజా మేడమ్ ఉన్నారు. మీరు టూరిజం మంత్రి కదా... ఏ ప్రాజెక్టు ఎలా చేస్తున్నారు అంటే... నా సొగసు చూడు మామయ్యా అంటోందట. ప్రాజెక్టుల గురించి అడిగితే నా సొగసు చూడు మామయ్యా అంటే ఏటి చూత్తాం మనం" అంటూ ఉత్తరాంధ్ర యాసలో వ్యంగ్యం ప్రదర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి పరిపాలన సాగుతోందని అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, ప్రపంచంలో తెలుగు వారి గౌరవాన్ని పెంచింది ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. నటనలో ఎన్టీఆర్ కు సాటి మరెవరూ లేరని అయ్యన్న కొనియాడారు. ఏ పాత్రలో నటించినా అందులో లీనమయ్యే వ్యక్తి ఎన్టీఆర్ అని కీర్తించారు.

More Telugu News