Jr NTR: ఎన్టీఆర్​ ఘాట్ వద్ద తారక్‌ను ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్

  • ఈ రోజు ఎన్టీఆర్ శత జయంతి
  • నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన తారక్‌
  • సీఎం సీఎం అంటూ నినాదాలు చేసిన అభిమానులు
Tarak faces trouble with fans at NTR Ghat

ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ శత జయంతి. ఈ  సందర్భంగా  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. పలువురు ప్రముఖులు విగ్రహాల వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఉదయం తారక్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తారక్‌ను చూడగానే అందరూ ముందుకొచ్చారు. భద్రతా సిబ్బంది తారక్ చుట్టూ వలయంలా నిల్చున్నప్పటికీ వారిని కంట్రోల్ చేయలేకపోయారు. దాంతో, తారక్ ఇబ్బంది పడుతూనే ముందుకు నడిచారు.

ఈ క్రమంలో పలువురు అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇక, ఎన్టీఆర్ సమాధి వద్దకు చేరుకున్న తారక్‌ కొందరు కార్యకర్తల అత్యుత్సాహంతో ఇబ్బంది పడ్డారు. సమాధిపై వేసేందుకు తారక్‌కు పూల మాల ఇచ్చేందుకు ఇద్దరు వ్యక్తులు పోటీ పడ్డారు. నేనిస్తానంటే నేనిస్తానంటూ పోటీ పడటంతో తారక్‌ కాస్త అసహనానికి గురయ్యారు. ఆ పూల మాలను తిరస్కరించి సమాధిపై పూలు చల్లి, నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

More Telugu News