Parliament: మరి కాసేపట్లో పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం

  • ఉదయం 7.15 గంటలకు కార్యక్రమం ప్రారంభం
  • ప్రారంభోత్సవానికి 18 ఎన్డీఏ, 5 నాన్ ఎన్డీఏ పార్టీలు హాజరు
  • కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు
New parliament building to be inaugurated today

భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో మరికాసేపట్లో ఓ కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంటును ప్రారంభించనున్నారు. నేడు ఉదయం 7.15 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. 

ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇదీ

  • ఉదయం 7.15: పార్లమెంటు ప్రధాన ద్వారం నుంచి మోదీ ప్రవేశం
  • 7.30 నుంచి 8.30: వివిధ పూజా కార్యక్రమాలు, అనంతరం లోక్‌సభ ప్రవేశం
  • మధ్యాహ్నం 12.00:  పార్లమెంటు భవన ప్రారంభ వేడుక
  • 12.10: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ స్వాగతోపన్యాసం, ఆ తరువాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ప్రసంగాలను ఆయన చదివి వినిపిస్తారు.
  • 12.43: లోక్‌సభ స్పీకర్ ప్రసంగం,
  • 1.05: ప్రధాని చేతుల మీదుగా ప్రత్యేక నాణెం, తపాలా బిళ్ల ఆవిష్కరణ
  • 1.10: ప్రధాని ప్రసంగం
ఈ కార్యక్రమంలో 18 ఎన్డీయే పార్టీలు, వైసీపీ, టీడీపీ సహా 5 నాన్ ఎన్డీఏ పార్టీలు హాజరవుతున్నాయి. కాంగ్రెస్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.

More Telugu News