Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవం

Chandrababu unanimously elected as TDP National President
  • రాజమండ్రిలో టీడీపీ మహానాడు సమావేశాలు
  • నేడు టీడీపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు
  • చంద్రబాబుకు మద్దతుగా 11 నామినేషన్లు
  • కమిటీల ఏర్పాటుపై చంద్రబాబుకే సర్వాధికారాలు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ రాజమండ్రిలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు. 

చంద్రబాబుకు మద్దతుగా 11 నామినేషన్లు వచ్చాయి. పోటీలో మరెవరూ లేకపోవడంతో మరోసారి చంద్రబాబుకే పార్టీ జాతీయ పగ్గాలు అప్పగించారు. అంతేకాదు, కమిటీల ఏర్పాటుపై సర్వాధికారాలు చంద్రబాబుకే అప్పగించారు. అనంతరం చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. 

మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ, పేదవాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని, తాను కూడా పేద కుటుంబం నుంచే వచ్చానని వెల్లడించారు. తెలుగు జాతి కోసమే పనిచేస్తున్నానని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రిగా చేసే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. నా జీవితం తెలుగు జాతికే అంకితం అని స్పష్టం చేశానని పేర్కొన్నారు.
Chandrababu
National President
TDP
TDP Mahanadu
Rajahmundry

More Telugu News