Nara Lokesh: జగన్ అసమర్థతతో ఆ తేడా 10 రెట్లు పెరిగింది: లోకేశ్

  • రాజమండ్రిలో టీడీపీ మహానాడు
  • సీఎం జగన్ ను టార్గెట్ చేసిన టీడీపీ నేతలు
  • ఏపీ ఆదాయం కంటే తెలంగాణ ఆదాయం పెరిగిందన్న లోకేశ్ 
Lokesh slams CM Jagan in Mahanadu

రాజమండ్రిలో జరుగుతున్న మహానాడు వేదికగా టీడీపీ అగ్రనాయకత్వం సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. గత కొన్నేళ్లుగా ఏపీ కంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయమే పెరుగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. 2019లో ఏపీ కంటే తెలంగాణ ఆదాయం రూ.4 వేల కోట్లు అధికం అని వెల్లడించారు. జగన్ అసమర్థతతో ఇప్పుడా వ్యత్యాసం 10 రెట్లు పెరిగిందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారిస్తామని లోకేశ్ చెప్పారు. 

కాగా టీడీపీ మహానాడులో ఇవాళ వివిధ తీర్మానాలపై చర్చ జరిపారు. ఏపీలో అడ్డుఅదుపులేని అత్యాచారాలు, హత్యలు అనే తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి టీడీపీ మహానాడు ఆమోదం తెలిపింది. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వివేకా హత్యను ప్రస్తావించారు. 

వివేకా హత్య వెనుక జగన్ ఉన్నాడని సీబీఐ చెప్పేసిందని వ్యాఖ్యానించారు. దీనిపై జగన్, ఆయన పేటీఎం బ్యాచ్ సమాధానం చెప్పాలని అన్నారు. "వివేకా హత్యను నాపై మోపేందుకు ప్రయత్నం చేశారు. హత్య సూత్రధారి, పాత్రధారి రాజకీయాల్లో ఉండొచ్చా? హంతకుల నుంచి ఏపీని కాపాడాలి" అని నినదించారు. 

ఇక, రూ.2 వేల నోట్లతో పాటు రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ నేతల వద్ద రూ.2000, రూ.500 నోట్లు చాలా ఉన్నాయని అన్నారు. వాళ్లు దోచుకున్న ప్రతి పైసా వసూలు చేసి పేదలకు అందజేస్తామని చెప్పారు.

More Telugu News