samantha: ఆంగ్ల చిత్రానికి ఓకే చెప్పిన సమంత

Samantha acting in Hollywood movie
  • 'చెన్నై స్టోరీ' అనే ఆంగ్ల చిత్రంలో నటించనున్న సమంత
  • ఇంగ్లాండ్ యువకుడికి, చెన్నై యువతికి మధ్య జరిగే ప్రేమ కథాంశంగా చిత్రం
  • హీరోగా నటించనున్న వివేక్ కల్రా
సమంత క్రేజ్ నానాటికీ పెరిగిపోతోంది. మొన్నటి దాకా దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న సమంతకు ఇప్పుడు నార్త్ లో కూడా అభిమానులు విపరీతంగా పెరిగిపోతున్నారు. 36 ఏళ్ల సమంత ఇప్పుడు ఓ అంతర్జాతీయ చిత్రంలో నటించనుంది. 'చెన్నై స్టోరీ' అనే ఆంగ్ల చిత్రంలో నటించబోతోంది. ఈ సినిమాలో ఇంగ్లాండ్ కు చెందిన వివేక్ కల్రా హీరోగా నటించనున్నాడు. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇంగ్లాండ్ కు చెందిన యువకుడికి, చెన్నైకు చెందిన యువతికి మధ్య జరిగే ప్రేమ కథగా ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు విజయ్ దేవరకొండ, సమంత జంటగా 'ఖుషి' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' హిందీ వర్షన్ లో కూడా సమంత నటిస్తోంది.
samantha
Tollywood
Bollywood
Chennai Story
Hollywood

More Telugu News