మీడియా ప్రతినిధులను అవినాశ్ అనుచరులు కొట్టడం దుర్మార్గం: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna letter to Jagan
  • కర్నూలు ఆసుపత్రి వద్ద జర్నలిస్టుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన రామకృష్ణ
  • సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విన్నపం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో వైఎస్ అవినాశ్ రెడ్డి ఉన్న సమయంలో జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. పలు మీడియా సంస్థల ప్రతినిధులను అవినాశ్ అనుచరులు లాక్కెళ్లి కొట్టడం దుర్మార్గమని అన్నారు. ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని కోరారు. జర్నలిస్టు సంఘాల నేతలు అడిషనల్ ఎస్సీని కలిసి విన్నవించినప్పటికీ ఇప్పటి వరకు దుండగులను పట్టుకోలేదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. 
Go Back to Shorts
CPI Ramakrishna
Jagan
YSRCP

More Telugu News