new Parliament building: పార్లమెంట్ కొత్త భవనం.. ఎన్నో ప్రత్యేకతల నిలయం

  • త్రికోణాకారంలో నూతన భవనం
  • అందులోనే లోక్ సభ, రాజ్యసభ
  • పాత భవనం కంటే ఎక్కువ సీట్లు
  • ఎంతో ఎత్తులో సభాధ్యక్ష స్థానాలు
  • దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక మెటీరియల్
Indias new Parliament building Significant features

పార్లమెంట్ కొత్త భవనాన్ని 28న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. భారత ప్రజాస్వామ్యం నూతన చిహ్నమైన దీని నిర్మాణానికి ఎన్నో విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. 

ఇప్పటి వరకు ఉపయోగించిన పార్లమెంట్ భవనం 1927లో నిర్మించినది. దాదాపు నూరు సంవత్సరాల క్రితం నాటి భవనం కావడం, నేటి అవసరాలకు అంత అనుకూలంగా లేకపోవడంతో లోక్ సభ, రాజ్యసభలో తీర్మానాలు చేసి, కొత్త భవనాన్ని నిర్మించారు. పాత భవనంలో లోక్ సభలో అయితే 543 మంది కూర్చోవడానికి సీట్లు ఉన్నాయి. రాజ్యసభలో 250 మంది కూర్చోవచ్చు. కానీ కొత్త భవనంలో లోక్ సభ సభ్యులకు 888 సీట్లు, రాజ్యసభ సభ్యులకు 384 సీట్లు ఉన్నాయి. 

  • కొత్త పార్లమెంట్ భవనం 64,500 చదరపు మీటర్లలో నిర్మించారు. త్రికోణాకారంలో ఇది ఉంటుంది. లోక్ సభ చాంబర్ జాతీయ పక్షి నెమలి మాదిరి డిజైన్, రాజ్యసభ చాంబర్ జాతీయ పువ్వు కమలం డిజైన్ తో ఉంటాయి.
  • కొత్త భవనం వినియోగంలోకి వచ్చిన తర్వాత, పాత పార్లమెంట్ భవనాన్ని చారిత్రక సంపదగా పరిరక్షిస్తారు. 
  • మంత్రుల కోసం 92 గదులను ఏర్పాటు చేశారు. సభ్యుల సీట్లకు డిజిటల్ టచ్ స్క్రీన్లు ఉంటాయి. 
  • వాన నీటిని సంరక్షించే సదుపాయాలు కూడా ఉన్నాయి. 
  • విద్యుత్ అంతరాయాలను దృష్టిలో పెట్టుకుని, నూరు శాతం యూపీఎస్ పవర్ బ్యాకప్ కల్పించారు. 
  • లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, ఇతర అధికారుల స్థానాలను సభ్యులకు అందనంత ఎత్తులో ఏర్పాటు చేశారు. వారి ఆందోళనల నుంచి రక్షణ కోసం ఇలా చేశారు. 
  • అహ్మదాబాద్ కు చెందిన హెచ్ సీపీ డిజైన్ అండ్ మేనేజ్ మెంట్ డిజైన్ చేయగా, టాటా ప్రాజెక్ట్స్ దీన్ని నిర్మించింది. 
  • రెడ్, వైట్ శాండ్ స్టోన్ ను రాజస్థాన్ లోని సర్మతురా నుంచి తెప్పించారు. 
  • టేక్ వుడ్ ను మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి తెప్పించారు. 
  • కేసారియా గ్రీన్ స్టోన్ ను ఉదయ్ పూర్ నుంచి తెచ్చారు. 
  • ఎర్ర గ్రానైట్ ను అజ్మీర్ సమీపంలోని లఖా నుంచి తీసుకొచ్చారు. తెల్లటి మార్బుల్ ను రాజస్థాన్ లోని అంబాలీ నుంచి తెప్పించారు.
  • ఫర్మిచర్ ను ముంబైలో తయారు చేయించారు. 
  • లోక్ సభ, రాజ్యసభలో ఫాల్స్ సీలింగ్ కోసం స్టీల్ ను డామన్ అండ్ డయ్యూ నుంచి తెప్పించారు. 
  • అశోకుడి గుర్తు కోసం కావాల్సిన మెటీరియల్ ను మహారాష్ట్రలోని ఔరంగాబాద్, రాజస్థాన్ లోని జైపూర్ నుంచి తీసుకొచ్చారు. 
  • ఫ్లై యాష్ బ్రిక్స్ ను హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి తెప్పించారు.

More Telugu News