Battlegrounds Mobile India: 29 నుంచి అందుబాటులోకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ గేమ్

Battlegrounds Mobile India preload begins for Android users gameplay starts May 29
  • గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
  • 28 నుంచి యాపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్
  • 29 నుంచి పని చేయనున్న గేమింగ్ యాప్

పబ్ జీ మొబైల్ గేమ్ అంటే ఎంతో మంది గేమింగ్ ప్రియులకు ఇష్టం. కేంద్ర సర్కారు దీన్ని నిషేధించడం చాలా మందిని నిరాశకు గురి చేసింది. ఇప్పుడు పబ్ జీకి ప్రత్యామ్నాయమైన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా మొబైల్ గేమింగ్ ఈ నెల 29 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ గేమ్ ను క్రాఫ్టాన్ ఇండియా అనే సంస్థ అభివృద్ధి చేసింది. యాపిల్ ఐవోఎస్ యూజర్లు 28వ తేదీ నుంచి ప్రీలోడ్ (డౌన్ లోడ్) చేసుకోవచ్చు.

అందరికీ ఈ గేమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు క్రాఫ్టాన్ ఇండియా చర్యలు తీసుకుంటోంది.  పబ్ జీకి కొత్త రూపమే బ్యాటిల్ గ్రౌండ్స్. దీన్ని భారత మార్కెట్ కోసమే అభివృద్ధి చేశారు. ఈ యాప్ కు కేంద్ర సర్కారు నుంచి అనుమతి కూడా వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టాన్ భారత విభాగమే క్రాఫ్టాన్ ఇండియా. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పబ్ జీకి అప్పట్లో 3.3 కోట్ల మంది యూజర్లు ఉండేవారు. బ్యాటిల్ గ్రౌండ్స్ కు ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి.

  • Loading...

More Telugu News