TDP Mahanadu: మహానాడులో లోకేశ్ ఎంట్రీ.. కార్యకర్తల్లో జోష్!

Party members elated after seeing lokesh in Mahanadu
  • మహానాడులో నారా లోకేశ్ ఎంట్రీతో కార్యకర్తల్లో నూతనోత్సాహం
  • నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించిన అభిమానులు 
  • యువనేతతో ఉత్సాహంగా సెల్ఫీలు దిగిన వైనం
  • అందరినీ అప్యాయంగా పలకరించిన లోకేశ్
రాజమండ్రిలో నేడు మహానాడు కార్యక్రమం గ్రాండ్‌గా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రావడం చూసీ టీడీపీ కార్యకర్తలు నూతనోత్సాహంతో పెద్దపెట్టున నినాదాలు చేశారు. కేరింతలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. అనేక మంది యువనేతతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. తన కోసం వచ్చిన కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించిన లోకేశ్ స్టేజీపై ఆసీనులయ్యారు. 

‘జనహృదయమైన నారా లోకేశ్’ అంటూ యువగళం పాదయాత్రపై కేశినేని చిన్ని ముద్రించిన పుస్తకం కార్యకర్తల్లో ఆసక్తి రేకెత్తించింది. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అభిమానులు, కార్యకర్తలు లోకేశ్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ గుంటూరు జిల్లా ప్రతినిధుల రిజిస్టర్‌‌లో నమోదు చేసుకున్నారు.
TDP Mahanadu

More Telugu News