BV Satyamurthy: ‘చదువుల్రావు’ సృష్టికర్త.. సీనియర్ కార్టూనిస్ట్ సత్యమూర్తి కన్నుమూత

Cartoonist Satyamurthy Passed Away
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యమూర్తి
  • 1982లో ఉగాది పురస్కారంతో సత్కరించిన  ఏపీ ప్రభుత్వం
  • బీవీ పట్టాభిరామ్‌కు సత్యమూర్తి స్వయాన అన్నయ్య
‘చదువుల్రావు’ వంటి వ్యంగ్య చిత్రాలను సృష్టించి పాఠకులను అలరించిన సీనియర్ కార్టూనిస్ట్ సత్యమూర్తి కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. వ్యంగ్య చిత్రాల రూపకర్త అయిన ఆయన పూర్తిపేరు భావరాజు వెంకట సత్యమూర్తి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో  తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్‌కు సత్యమూర్తి స్వయాన అన్నయ్య. ఆయన గీసిన వ్యంగ్య కార్టూన్లు ఆంధ్రపత్రిక ముఖచిత్రంగా ప్రచురించింది. సత్యమూర్తి ప్రతిభను గుర్తించిన అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1982లో ఉగాది పురస్కారంతో సత్కరించింది. న్యూఢిల్లీ తెలుగు అకాడమీ, ఉమ్మడి ఏపీ ప్రెస్ అకాడమీ తదితర సంస్థల నుంచి అవార్డులను అందుకున్నారు. సత్యమూర్తికి భార్య జోగేశ్వరి, కుమార్తె ప్రొఫెసర్ పద్మావతి ఉన్నారు. కుమారుడు సాయిభాస్కర్ ఇటీవలే మృతి చెందారు.
BV Satyamurthy
Cartoonist Satyamurthy
BV Pattabhi Ram

More Telugu News