ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్ కు వర్షం అడ్డంకి

  • నేడు అహ్మదాబాద్ లో క్వాలిఫయర్-2
  • గుజరాత్ టైటాన్స్ × ముంబయి ఇండియన్స్
  • వర్షం కారణంగా టాస్ ఆలస్యం
Rain delays toss in qualifier 2

ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ లో వర్షం కురుస్తుండడంతో, టాస్ వేయడానికి కూడా సాధ్యం కాలేదు. వర్షం పడుతుండడంతో నరేంద్ర మోదీ స్టేడియాన్ని కవర్లతో కప్పివేశారు. కొద్దిసేపటి క్రితం వర్షం నిలిచిపోవడంతో కవర్లను తొలగించారు. ఆటగాళ్లు ప్రాక్టీసు కోసం మైదానంలో అడుగుపెట్టడంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం పెల్లుబికింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఎల్లుండి (మే 28) ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీకొంటుంది.

More Telugu News