Arvind Kejriwal: సుప్రీంకోర్టుకు ప్రధానే కట్టుబడి ఉండకపోతే.. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి?: కేజ్రీవాల్

Arvind Kejriwal to boycott Niti Aayog meet writes to PM
  • ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ స‌మావేశాన్ని బహిష్కరిస్తున్నామన్న కేజ్రీవాల్ 
  • సహకార సమాఖ్య విధానం జోక్ అయినప్పుడు మీటింగ్ లో పాల్గొనడంలో అర్థమేంటని ప్రశ్న 
  • ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ‌ రాసిన ఢిల్లీ సీఎం
ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ స‌మావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. తాము ఆ సమావేశానికి వెళ్ల‌డం లేద‌ని స్పష్టం చేశారు. ఆయ‌న ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ‌ రాశారు. సహకార సమాఖ్య విధానం జోక్ గా మారినప్పుడు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడంలో అర్థమేముందని ప్రశ్నించారు.

‘‘ప్రజలు అడుగుతున్నారు.. సుప్రీంకోర్టుకు ప్రధాన మంత్రే కట్టుబడి ఉండకపోతే.. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి? సహకార ఫెడరలిజం అనేది ఒక జోక్ గా మారినప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడంలో అర్థమేముంది? అని లేఖలో పేర్కొన్నారు.
Arvind Kejriwal
Narendra Modi
Niti Aayog
Letter to PM
Supreme Court

More Telugu News