కేసీఆర్ ను కలిసేందుకు రేపు హైదరాబాద్ కు వస్తున్న కేజ్రీవాల్

  • ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాలపై ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్రం
  • ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్న ఆప్ ప్రభుత్వం
  • మద్దతు కోసం విపక్ష నేతలను కలుస్తున్న కేజ్రీవాల్
Kejriwal coming to Hyderabad to meet KCR

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రేపు హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన భేటీకానున్నారు. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో గ్రూప్-ఏ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ ను ఆప్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వానిదే నియంత్రణాధికారమని ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పును వెలువరించింది. ఈ తీర్పును అమలు చేయాలంటూ కేజ్రీవాల్ తో పాటు ఆప్ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతును కూడగట్టేందుకు ఇప్పటికే పలువురు నేతలను కేజ్రీవాల్ కలిశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ తో రేపు కేజ్రీవాల్ భేటీ కాబోతున్నారు.

More Telugu News