నటి డింపుల్ హయతి ఇంట్లోకి ఇద్దరు యువతీయువకులు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • రాజమండ్రి నుంచి వచ్చిన యువతీ యువకులు 
  • కొప్పిశెట్టి సాయిబాబు, శ్రుతిగా గుర్తింపు
  • డింపుల్ చెప్పడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టిన పోలీసులు
Young Couple intrusion into actress Dimple Hayathi house

టాలీవుడ్ నటి డింపుల్ హయతి ఇంట్లోకి ఇద్దరు యువతీయువకులు ప్రవేశించడం కలకలం రేపింది. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్‌లో డింపుల్.. తన సహచరుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. నిన్న ఉదయం అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన యువతీయువకులు సీ2లో ఉండే డింపుల్ ఇంట్లోకి వెళ్లారు. అక్కడే ఉన్న పనిమనిషి వారిని చూసి ఎవరని ఆరా తీసే ప్రయత్నం చేసింది. అంతలో వారి ఇంట్లోని కుక్క వారి వద్దకు రావడంతో భయపడి లిఫ్ట్‌లోకి వెళ్లిపోయారు. అందులోకి కూడా వెళ్లిన కుక్క తిరిగి బయటకు వచ్చింది.

విషయం తెలిసిన నటి వెంటనే 100కు డయల్ చేసి విషయం చెప్పారు. కాసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తే తాము రాజమండ్రి నుంచి వచ్చామని, డింపుల్ అభిమానులమని పేర్కొన్నారు. వారిని కొప్పిశెట్టి సాయిబాబు, ఆయన బంధువు శ్రుతిగా గుర్తించారు. ఇటీవల ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకు, డింపుల్‌కు మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో కలవడానికి వచ్చినట్టు చెప్పారు. విషయాన్ని డింపుల్‌కు చెప్పడంతో వారిని విడిచిపెట్టమని చెప్పడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు.

More Telugu News