Sitara gattamaneni: టీనేజ్ లోనే మహేశ్ బాబు కుమార్తె సితార రికార్డు

Sitara becomes Indias first star kid to sign the biggest deal to endorse a premium jewellery brand
  • పీఎంజే జ్యుయలరీ బ్రాండ్ అంబాసిడర్ గా సితార
  • మూడు రోజుల పాటు ప్రచార చిత్రం షూటింగ్
  • చిన్న వయసులోనే తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు
ప్రముఖ నటుడు మహేశ్ బాబు ముద్దుల తనయ సితార టీనేజ్ లోనే రికార్డు సృష్టించింది. మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతుల కుమార్తె సితార చిన్న వయసులోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుందని చెప్పుకోవాలి. డ్యాన్స్ వీడియోలతో, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ, ఎక్కువ మంది తనను అనుసరించేలా చేసుకుంటోంది ఈ గడుగ్గాయి. ఇప్పుడు ప్రముఖ జ్యుయలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా మారిపోయింది.

పీఎంజే జ్యుయలరీ సితారను తన ప్రచారకర్తగా నియమించుకుంది. ఇందు కోసం ఆమెకు పెద్ద మొత్తంలోనే చెల్లించనున్నట్టు సమాచారం. సితారతో ఇటీవలే ఓ ప్రచార చిత్రాన్ని కూడా షూట్ చేశారు.  ఓ లొకేషన్ లో మూడు రోజుల పాటు షూటింగ్ జరిగింది. పేరొందిన టెక్నీషియన్లు ఇందులో భాగం అయ్యారు. రానున్న రోజుల్లో సితారతో రూపొందించిన ప్రకటన మనకు టీవీల్లో కనిపించనుంది. ఈ డీల్ తో చిన్న వయసులోనే తండ్రికి తగ్గ తనయ అని సితార మరోసారి నిరూపించుకుంది. మహేశ్ బాబు సైతం బాల నటుడిగా అదరగొట్టడం గుర్తుండే ఉంటుంది.
Sitara gattamaneni
Mahesh Babu
daughter
add film
jewellary

More Telugu News