అవినాశ్ రెడ్డి తల్లి హైదరాబాద్ కు తరలింపు.. టీఎస్ హైకోర్టులో అవినాశ్ బెయిల్ పై వాదనలు ప్రారంభం

  • ఈనెల 19న ఆసుపత్రిలో చేరిన అవినాశ్ తల్లి
  • మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు
  • టీఎస్ హైకోర్టులో అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన సీబీఐ
YS Avinash Reddy mother shifted to Hyderabad

కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి నుంచి కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మి డిశ్చార్జ్ అయ్యారు. గుండె సంబంధిత ఇబ్బందితో బాధపడుతున్న ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నారు. లోబీపీ, గుండెపోటుకు గురి కావడంతో ఆమెను ఈ నెల 19న విశ్వభారతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కొంచెం కోలుకున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆమెను మెరుగైన ఆసుపత్రికి తరలిస్తున్నారు. 

మరోవైపు అవినాశ్ ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమయింది. అవినాశ్ తరపున లాయర్ ఉమామహేశ్వరరావు, సునీత తరపున సీనియర్ కౌన్సిల్ రవిచంద్ వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు సీబీఐ అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

More Telugu News