అమ్మను మెరుగైన ఆసుపత్రికి తరలిస్తున్నాం: వైఎస్ అవినాశ్ రెడ్డి

  • అమ్మ ఆరోగ్యం కొంచెం మెరుగైందన్న అవినాశ్
  • తమకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అన్న వైసీపీ ఎంపీ
  • అవినాశ్ తల్లిని బెంగళూరు లేదా హైదరాబాద్ కు తరలించే అవకాశం
Shifting my mother to better hospital says YS Avinash Reddy

కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్యం మెరుగుపడినట్టు కాసేపటి క్రితం కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే గుండె సంబంధిత చికిత్స కోసం ఆమెను మెరుగైన ఆసుపత్రికి తరలిస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు. మరోవైపు తన తల్లి ఆరోగ్యంపై వైఎస్ అవినాశ్ రెడ్డి స్పందించారు. తన తల్లి ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందని ఆయన తెలిపారు. తమకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పారు. తమ వల్ల ఎరికైనా ఇబ్బంది కలిగితే మనసులో పెట్టుకోవద్దని కోరారు. మరోవైపు అవినాశ్ తల్లిని బెంగళూరు లేదా హైదరాబాద్ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News