New Parliament Building: రూ. 75 నాణాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం.. కారణం ఇదే!

  • ఈ నెల 28న నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్న మోదీ
  • దీనికి గుర్తుగా రూ. 75 నాణెం విడుదల
  • పార్లమెంటు కాంప్లెక్స్, కొత్త పార్లమెంటు భవనం ముద్రణ
Centre to launch Rs 75 coin to mark new Parliament buildings inauguration

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగా రూ. 75 నాణాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నాణెంపై పార్లమెంటు కాంప్లెక్స్, కొత్త పార్లమెంట్ భవనం చిహ్నం ఉంటాయని పేర్కొంది. వృత్తాకారంలో ఉండే ఈ నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి అంచుల్లో  200 గీతలు ఉంటాయని తెలిపింది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో కూడిన లోహంతో ఈ నాణాన్ని తయారు చేసినట్టు వివరించింది. అలాగే, పార్లమెంటు కాంప్లెక్స్ చిహ్నం కింద 2023 అని కూడా ఉంటుందని పేర్కొంది.

పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి 25 పార్టీలు హాజరవుతుండగా, ప్రధాని ప్రారంభించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించాయి.

More Telugu News