Karnataka: రేపు సిద్ధరామయ్య మంత్రివర్గ విస్తరణ.. ప్రమాణం చేయనున్న 24 మంది మంత్రులు

24 Ministers To Take Oath On Saturday In Siddaramaiah Cabinet
  • ఈ నెల 20న బాధ్యతలను స్వీకరించిన సిద్ధూ, డీకే
  • మరో 8 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం
  • ఇప్పటి వరకు మంత్రులకు శాఖలను కేటాయించని వైనం
ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి, ఎవరి మద్దతు అవసరం లేకుండానే ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య సీఎంగా, డీకే శివకుమార్ డిప్యూటీగా బాధ్యతలను స్వీకరించారు. మరోవైపు సిద్ధరామయ్య మంత్రివర్గ విస్తరణ రేపు జరగనుంది. 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే సిద్ధూ, డీకే ఇద్దరూ ఢిల్లీలో ఉన్నారు. మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలనే విషయంపై హైకమాండ్ తో చర్చించి తుది జాబితాను రెడీ చేశారు. 

ఈ నెల 20న సిద్ధూ, డీకేతో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఉన్నారు. అయితే, ఇప్పటి వరకు మంత్రులకు శాఖలను కేటాయించలేదు. రేపు మంత్రివర్గ విస్తరణ పూర్తి అయిన తర్వాత శాఖలను కేటాయించే అవకాశం ఉంది.
Karnataka
Siddaramaiah
Cabinet
Expansion

More Telugu News