టిప్పుసుల్తాన్ ఖడ్గానికి వేలంలో కళ్లుచెదిరే ధర

Sword of Tippu Sultan garners huge price in auction
భారతీయ ముస్లిం పాలకుడు, మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఖడ్గం బ్రిటన్ లో నిర్వహించిన వేలంలో కళ్లు చెదిరే ధర పలికింది. ఈ చారిత్రక ఖడ్గాన్ని లండన్ లో బోన్హామ్స్ ఆక్షన్ హౌస్ వేలం వేసింది. ఓ వ్యక్తి ఈ అపురూపమైన ఖడ్గాన్ని రూ.144 కోట్లకు దక్కించుకున్నాడు. 

ఈ వేలంలో ముగ్గురి మధ్య హోరాహోరీ నెలకొనగా, అత్యధిక మొత్తంలో బిడ్డింగ్ వేసిన వ్యక్తిని ఈ కత్తి వరించింది. అయితే, టిప్పు ఖడ్గాన్ని వేలంలో దక్కించుకున్న వ్యక్తి వివరాలను బోన్హామ్స్ సంస్థ గోప్యంగా ఉంచింది. అంతేకాదు, ఆ ఖడ్గాన్ని తాము ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేసింది కూడా ఆ సంస్థ రహస్యంగా ఉంచింది. తాము అంచనా వేసిన ధర కంటే ఏడు రెట్లు ఎక్కువ ధరను ఈ ఖడ్గం రాబట్టిందని బోన్హామ్స్ సంతోషం వ్యక్తం చేసింది. 

కాగా,  18వ శతాబ్దం నాటి ఈ ఖడ్గాన్ని మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా 2003లోనే ఓ వేలంలో కొనుగోలు చేశాడు. అయితే ఈ ఖడ్గం తన ఇంటికి వచ్చాక తనకు కలిసిరాలేదని, అందుకే విక్రయిస్తున్నట్టు అప్పట్లో మాల్యా చెప్పారు. ఆ మేరకు మీడియా కథనాలు వచ్చాయి.
Go Back to Shorts
Tippu Sultan
Sword
Auction
London
UK
India

More Telugu News