బాలయ్యతో ఈ సారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ను సెట్ చేసిన బోయపాటి!

  • అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా బాలయ్య
  • రామ్ సినిమా షూటింగులో బోయపాటి
  • బాలయ్య 109వ సినిమా దర్శకుడు బోయపాటినే
  • గీతా ఆర్ట్స్ - 14 రీల్స్ కలిసి నిర్మించే సినిమా ఇది
Balayya in Boyapati Movie

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'లెజెండ్' .. 'సింహా' .. 'అఖండ' ఒకదానికి మించి మరొకటి రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టాయి. బాలయ్యను మాస్ యాక్షన్ హీరోగా బోయపాటి చూపించినట్టుగా మరొకరి వలన కాదనే ఒక క్రేజ్ ను అతను సొంతం చేసుకున్నాడు. అలాంటి బాలయ్యతో మరో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి బోయపాటి రెడీ అవుతున్నాడు. 


ఇది బాలయ్య కెరియర్లో 109వ సినిమా కానుంది. అందరూ కూడా ఇది 'అఖండ'కి సీక్వెల్ అనుకున్నారు. కానీ ఇది పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమా అని తెలుస్తోంది. బాలయ్య పొలిటికల్ కెరియర్ కి హెల్ప్ అయ్యేలా ఈ సినిమా కథ ఉంటుందని అంటున్నారు. కథ రాజకీయాల నేపథ్యమే అయినా, మాస్ యాక్షన్ పరంగా ఇద్దరి మార్క్ కనిపిస్తూనే ఉంటుందని చెబుతున్నారు. 

ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బాలయ్య బిజీగా ఉన్నారు. ఇక రామ్ ప్రాజెక్టుతో బోయపాటి తీరిక లేకుండా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగు పూర్తయిన తరువాత ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళతారనే టాక్ బలంగా వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ - 14 రీల్స్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించనున్నట్టుగా సమాచారం. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

More Telugu News