Kumaraswamy: జేడీఎస్ శాసనసభాపక్ష నేతగా కుమారస్వామి ఎన్నిక

  • ఇటీవలి ఎన్నికల్లో జేడీఎస్ తరపున 19 మంది గెలుపు
  • శాసనసభాపక్ష నేతగా కుమారస్వామిని ఎన్నుకున్న జేడీఎస్ ఎమ్మెల్యేలు
  • ఓటమితో నిరాశ చెందాల్సిన అవసరం లేదన్న కుమారస్వామి
Kumaraswamy Elected as LP leader of JDS

కర్ణాటక అసెంబ్లీలో జేడీఎస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్ దేశ్ పాండేను ఆయన కార్యాలయంలో జేడీఎస్ ప్రజాప్రతినిధులు కలిశారు. వీరిలో కుమారస్వామి సోదరుడు రేవణ్ణతో పాటు కొత్తగా గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఎమ్మెల్సీలు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభాపక్ష నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ... ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని అన్నారు.

More Telugu News