Patna High Court: ఈఎంఐ కట్టకపోతే ఏజెంట్లు వాహనం సీజ్ చేయడం చట్టవిరుద్ధం: పాట్నా హైకోర్టు

  • రుణ రికవరీ ఏజెంట్ల సేవలను వినియోగించుకోరాదన్న కోర్టు
  • జీవనం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనన్న న్యాయమూర్తి
  • అలాంటి రికవరీ ఏజెంట్లపై కేసుల నమోదుకు ఆదేశాలు
Banks canot use recovery agents to forcibly seize vehicles over non payment of car loan EMI Patna High Court

రుణం తీసుకున్న వారిని వేధింపులకు గురి చేసే బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీ సంస్థల పట్ల పాట్నా హైకోర్టు సీరియస్ గా స్పందించింది. రుణ ఈఎంఐ కట్టకపోతే ఏజెంట్ల సాయంతో బలవంతంగా వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించింది. ‘‘రికవరీ ఏజెంట్లు వాహనాలను సీజ్ చేయడం చట్టవిరుద్ధం. జీవనం, ఉపాధికి సంబంధించి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు కిందకు వస్తుంది’’ అని జస్టిస్ రాజీవ్ రంజన్ ప్రసాద్ తీర్పు చెప్పారు. 

కస్టమర్లు చెల్లింపుల్లో విఫలం అయితే వాహనాలను సీజ్ చేసేందుకు బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీలు రికవరీ ఏజెంట్ల సేవలను వినియోగించుకోకూడదని ధర్మాసనం పేర్కొంది. ఈ తరహా రికవరీ ఏజెంట్లపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వాహన రుణాలను బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీలే వసూలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సెక్యూరిటైజేషన్ చట్టం ఇందుకు సంబంధించిన అధికారాలను బ్యాంకులకు ఇచ్చినట్టు చెప్పారు. రుణ ఈఎంఐ చెల్లించకపోవడంతో బ్యాంకులు తమ వాహనాలను సీజ్ చేశాయంటూ దాఖలైన ఐదు పిటిషన్లపై విచారణ తర్వాత కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News